Karimnagar: చల్మెడ రాజేశ్వర్ రావుకు గౌరవ డాక్టరేట్ రావడం రైతులకే గర్వకారణం!
Karimnagar: కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్ రావు గౌరవ డాక్టరేట్ పొందడం పట్ల సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Karimnagar: చల్మెడ రాజేశ్వర్ రావుకు గౌరవ డాక్టరేట్ రావడం రైతులకే గర్వకారణం!
Karimnagar: అమెరికా లోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ వారు కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం రైతులకే గర్వకారణమని సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. డాక్టరేట్ పొందిన రాజేశ్వర్ రావు ను చాడ వెంకటరెడ్డి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పట్టభద్రులైన రాజేశ్వర్ రావు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం,వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందేందుకు ఆర్థికాభివృద్ధి చెందేందుకు ఆయన కృషి చేస్తున్నాడని,కరీంనగర్ లో పాలు అలాగే పాల ఉత్పత్తుల సేకరణలో,డెయిరీ అభివృద్ధిలో,మార్కెట్ పరిధిని విస్తరించడానికి,రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో కరీంనగర్ డెయిరీ నీ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిపిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని అన్నారు.
1971 లో 12 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించిన పాల డెయిరీ నేడు 3 లక్షలకు పెంచడంలో రాజేశ్వర్ రావు కృషి,పట్టుదల ఎంతో ఉందని,అప్పటి నుండి ఎన్నో అవార్డులు అందుకున్నాడని, భవిష్యత్ లో రైతులకు మరింత సేవ చేస్తూ,మరెన్నో అవార్డులు పొందాలని వెంకటరెడ్డి ఆకాంక్షిస్తూ రాజేశ్వర్ రావు ను అభినందించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ ఉన్నారు.




