Choppadandi: కరీంనగర్ డైరీ ఉదారత.. కొత్త దంపతులకు అదిరిపోయే గిఫ్ట్!

Choppadandi: కరీంనగర్ డైరీ సామాజిక బాధ్యతలో భాగంగా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని సౌమ్య-వినోద్ దంపతులకు పుస్తె మట్టెలను పంపిణీ చేసింది.

MADHUSUDHANREDDY, CHOPPADANDI
Published on: 9 May 2026 11:32 AM IST
Choppadandi
X

Choppadandi: కరీంనగర్ డైరీ ఉదారత.. కొత్త దంపతులకు అదిరిపోయే గిఫ్ట్!

చొప్పదండి: కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని సౌమ్య - వినోద్ దంపతులకు పుస్తె మట్టెలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, డైరీ ప్రతినిధులు పాల్గొని దంపతులను అభినందించారు.

గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న కరీంనగర్ డైరీ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని పలువురు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, డైరీ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమంతో పాటు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. పుస్తె మట్టెలు అందుకున్న సౌమ్య - వినోద్ దంపతులు కరీంనగర్ డైరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI

MADHUSUDHANREDDY, CHOPPADANDI

Next Story