Ganneruvaram: గన్నేరువరంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన డీఏఓ

Ganneruvaram: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గ్రోమోర్, డీసీఎంఎస్ ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి శత్రు నాయక్, ఏడీఏ శ్రీధర్ తనిఖీ చేశారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 12 Nov 2026 9:25 PM IST
Ganneruvaram
X

Ganneruvaram: గన్నేరువరంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన డీఏఓ

గన్నేరువరం: గన్నేరువరం మండలంలోని ఎరువుల దుకాణాలను కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి శత్రు నాయక్, మానకొండూరు వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీధర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రోమోర్, డీసీఎంఎస్ ఎరువుల కేంద్రాలను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించాలని తెలిపారు. ప్రస్తుతం మండలంలో రైతులు మొక్కజొన్న సాగుతో పాటు అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) వంశీకృష్ణరెడ్డి, సాయికుమార్ పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU