Karimnagar: శివానంద హాస్పిటల్ ఫైర్ ఎన్‌ఓసీ రద్దు చేయాలి కార్పొరేటర్
Karimnagar: కరీంనగర్ శివానంద హాస్పిటల్ ఫైర్ ఎన్‌ఓసీ రద్దు చేయాలని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డికి కార్పొరేటర్ ఫిర్యాదు. తనిఖీలు చేసి నోటీసులు ఇస్తామని హామీ.
Karimnagar: శివానంద హాస్పిటల్ ఫైర్ ఎన్‌ఓసీ రద్దు చేయాలి కార్పొరేటర్
కరీంనగర్: కరీంనగర్ నగర పరిధిలోని శివానంద & మెటర్నిటీ హాస్పిటల్‌లో తెలంగాణ అగ్నిమాపక చట్టం - 1999 మరియు నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC-2016) ప్రకారం కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కరీంనగర్ నగరపాలక సంస్థ 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల - తంగేళ్ళ కిరణ్ కుమార్ (టిల్లు) ఆరోపించారు.
ఆసుపత్రి భవనాన్ని తక్షణమే క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, నిబంధనలు పాటించే వరకు ఫైర్ ఎన్‌ఓసీ (Fire NOC) నిలిపివేయాలని/రద్దు చేయాలని కోరుతూ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు లేఖను అందజేశారు. దీనిపై స్పందించిన ఫైర్ ఆఫీసర్ వెంటనే విచారణ చేపట్టి ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అత్యంత సున్నితమైన గర్భవతులు, బాలింతలు, పసిపిల్లల వార్డులు (NICU/Pediatric Units) మరియు అత్యవసర చికిత్స పొందే రోగులు ఉండే ఈ ఆసుపత్రిలో ప్రమాదం సంభవిస్తే సురక్షితంగా బయటకు తరలించేందుకు సరిపడా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ (Emergency Fire Exits), ర్యాంప్‌లు (Ramps) లేవని ఆందోళన వ్యక్తం చేశారు.
1999 (సెక్షన్ 13): ఆసుపత్రులు తప్పనిసరిగా పొందాల్సిన 'ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ' పొందకపోవడం మరియు అమర్చిన పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడం లేదని అన్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC - 2016) ఉల్లంఘనలు:
'గ్రూప్ సి' ఇన్సిట్యూషనల్ బిల్డింగ్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 2 వెడల్పాటి అత్యవసర మెట్ల మార్గాలు (Fire Escape Staircases) లేకపోవడం ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోమేటిక్ స్ప్రెంక్లర్ వ్యవస్థ, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ అలారాలు సరిగ్గా లేకపోవడం.
తగినంత నీటి నిల్వ కలిగిన వాటర్ ట్యాంకులు, హైడ్రెంట్ పంపులు మరియు భవనం చుట్టూ అగ్నిమాపక వాహనాలు తిరిగేందుకు అవసరమైన 'సెట్‌బ్యాక్ స్థలం' లేకపోవడం.
గతంలో దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో జరిగిన అగ్నిప్రమాదాల్లో అనేకమంది పసిపిల్లలు, రోగులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను గుర్తు చేస్తూ... అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా ఎన్‌ఓసీ ఇస్తే భవిష్యత్తులో ఘోర ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరించారు.
అధికారుల బృందంతో శివానంద & మెటర్నిటీ హాస్పిటల్‌లో తక్షణ సమగ్ర ఉమ్మడి తనిఖీలు (Joint Inspection) నిర్వహించాలి డిమాండ్ చేశారు. అన్ని ప్రమాణాలు అమర్చే వరకు ఆసుపత్రి ఫైర్ ఎన్‌ఓసీని రద్దు చేయాలని అన్నారు.
రోగుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న యాజమాన్యంపై తెలంగాణ అగ్నిమాపక చట్టం సెక్షన్ 25 & 26 ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




