Karimnagar: రోడ్ ఎక్కని ఈ బస్సులు.. ప్రయాణికుల ఇబ్బందులు..

Karimnagar: కరీంనగర్-2 డిపో పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులు గత వారం రోజులుగా నిలిచిపోయాయి.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 7 July 2026 12:07 PM IST
Karimnagar
X

Karimnagar: రోడ్ ఎక్కని ఈ బస్సులు.. ప్రయాణికుల ఇబ్బందులు..

కరీంనగర్: కరీంనగర్ టు డిపోకు సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులు గత వారం రోజులుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రిక్ ఈ బస్సుల్లో వరస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో వాటిని డిపోలకు పరిమితం చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు ట్రిప్పులు నడిచేలా అధికారులు చర్యలు చేపట్టిన కొన్ని రూట్లలో సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ బస్సులు నడవకపోవడానికి గల కారణాలను అధికారులను అడగగా వాటికి సంబంధించిన టెక్నీషియన్లు ఢిల్లీ నుండి రావడం జరుగుతుందని అందుకే ఆలస్యం అవుతుందని తెలిపారు. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బస్సులు నిలిపివేసి ప్రమాదాల గల కారణాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాకే ఈ బస్సులను నడుపుతామని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని రూట్లో అదనపు బస్సులు నడుపుతున్నామని సెలవుల దినాలలో ప్రత్యేకంగా బస్సులో నడిపిన సరిపడా ట్రిప్పులు లేక కొంత ఆలస్యం జరుగుతుందని అయినా కూడా బస్సులను సరైన రూట్లలో సరైన సమయానికి సురక్షితంగా చేరడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story