Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన పనుల పరిశీలన!

Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా నిర్మించబడుతున్న ఆధునిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 16 Jun 2026 7:28 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన పనుల పరిశీలన!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా నిర్మించబడుతున్న భవన నిర్మాణ పనులను కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. సత్తు మల్లేష్ పరిశీలించారు.

ఈ సందర్భంగా డా. సత్తు మల్లేష్ మాట్లాడుతూ, నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన పఠన మందిరాలు, డిజిటల్ సదుపాయాలు, అద్భుతమైన ఆకర్షణీయమైన పెయింటింగ్స్, కళాత్మక చిత్రాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవనం విద్యార్థులు,

పోటీ పరీక్షల అభ్యర్థులు, పరిశోధకులు మరియు పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, మరో 15 రోజుల్లో నూతన గ్రంథాలయ భవనాన్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ నూతన భవనం జిల్లాలో పఠన సంస్కృతిని మరింత ప్రోత్సహించడంతో పాటు యువతకు విజ్ఞాన కేంద్రంగా నిలుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story