Karimnagar: కరీంనగర్ జిల్లాలో 2.77 లక్షల ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

Karimnagar: కరీంనగర్ జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 2.77 లక్షల ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 Jun 2026 10:39 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ జిల్లాలో 2.77 లక్షల ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

కరీంనగర్: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు కేటాయించిన 2,77,340 ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని జిల్లాలోని 16 మండలాలకు విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని, జిల్లాలోని అన్ని మండలాలకు అవసరమైన పాఠ్యపుస్తకాల సరఫరా ప్రక్రియను వంద శాతం కు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల విద్యాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సకాలంలో చేరేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా జూన్ 12వ తేదీ నాటికి ప్రతి పాఠశాలలో అన్ని తరగతులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి, విద్యార్థులకు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా పాఠ్యపుస్తకాల స్వీకరణ, నిల్వ, పంపిణీ ప్రక్రియలో ప్రధానోపాధ్యాయులు మరియు సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎక్కడా కొరత లేదా ఆలస్యం తలెత్తకుండా చూడాలని సూచించారు.

ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన అన్ని విద్యా వనరులు అందుబాటులో ఉండేలా విద్యాశాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన టెక్స్ట్‌బుక్స్ జిల్లా మేనేజర్, టెక్స్ట్‌బుక్స్ నోడల్ అధికారి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు మరియు సిబ్బందిని జిల్లా విద్యాశాఖాధికారి అభినందించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story