Karimnagar: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. కరీంనగర్‌లో అధికారుల కీలక సమావేశం!

Karimnagar: మాదకద్రవ్యాల రహిత జిల్లాగా కరీంనగర్‌ను మార్చేందుకు కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రణాళికలు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 28 May 2026 10:16 AM IST
Karimnagar
X

Karimnagar: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. కరీంనగర్‌లో అధికారుల కీలక సమావేశం!

కరీంనగర్: అందరం కలిసి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దామని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, యువత, తల్లిదండ్రులు సమష్టిగా మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలని కోరారు.

జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాధకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ వాడకంపై ఉక్కు పాదం మోపాలని సూచించారు.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 11 కేసులు నమోదు చేశామని 23 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 2.763 కేజీల గంజాయి,, నాలుగు గ్రాముల సింథటిక్ డ్రగ్, 8.2 గ్రాముల సింథటిక్ డ్రగ్ ను పట్టుకున్నామని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ ఉక్కు పాదం మోపుతున్నామని కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలలు విద్యాసంస్థలకు దగ్గర్లో పాన్ షాపులు సిగరెట్ షాపులు ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ

ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 30 కేసులు నమోదు చేశామని 63 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా దాదాపు 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 15 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. అదేవిధంగా 123 మందిని బైండోవర్ చేశామని చెప్పారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ డిఎం అండ్ హెచ్ ఓ వెంకటరమణ ఆర్డీవో కే మహేశ్వర్ వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story