Karimnagar: మోతాజ్ ఖానా యూపీహెచ్సీలో ఎల్సీడీసీ ప్రచార కార్యక్రమం ప్రారంభం
Karimnagar: కరీంనగర్ మోతాజ్ ఖానా యూపీహెచ్సీలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజగోపాల్ రావు ఎల్సీడీసీ కార్యక్రమం ప్రారంభించారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4 వరకు 14 రోజులు నిర్వహణ.
Karimnagar: మోతాజ్ ఖానా యూపీహెచ్సీలో ఎల్సీడీసీ ప్రచార కార్యక్రమం ప్రారంభం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు ఆధ్వర్యంలో, యూపీహెచ్సీ మోతాజ్ ఖానాలో కుష్టు వ్యాధి గుర్తింపు ప్రచార కార్యక్రమం (Leprosy Case Detection Campaign – LCDC) ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు సిబ్బంది సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజల్లో కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించడం, అనుమానిత కేసులను గుర్తించి తగిన వైద్య చికిత్స అందించడం ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమం 22-10-2026 నుండి 04-11-2026 వరకు 14 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించి, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలకు సూచిస్తారు.
కుష్టు వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి, పూర్తిస్థాయిలో చికిత్స పొందడం ద్వారా వైకల్యాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు. కుష్టు వ్యాధి పట్ల అపోహలు, వివక్ష విడనాడి, లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇమ్రాన్ ఖాన్ వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




