Karimnagar: కరీంనగర్‌లో డంప్ యార్డ్ లొల్లి.. ప్రజావాణిలో ఎస్‌ఈకి వినతిపత్రం!
Karimnagar: కరీంనగర్ నగరంలో ఐక్య రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో డంప్ యార్డ్ సమస్యపై ప్రజావాణిలో ఎస్‌ఈ (SE) రాజ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
Karimnagar: కరీంనగర్‌లో డంప్ యార్డ్ లొల్లి.. ప్రజావాణిలో ఎస్‌ఈకి వినతిపత్రం!
Karimnagar: నగరంలో కొన్ని సంవత్సరాలుగా డంప్ యార్డ్ తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జనసేన నేతలు ప్రజావాణిలో(SE ) రాజ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో డంప్ యార్డ్ పొగ వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని దీనిని పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని వారు విమర్శించారు.
అధికారంలోకి రాగానే డంప్యాడ్ సమస్య పరిష్కారిస్తామని చెప్పి ఎన్నికల్లో మాట ఇచ్చి మాట మార్చడం సరైనది కాదన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో కోట్ల రూపాయలు డంప్ యార్డ్ పరిష్కారం కోసం నిధులు కేటాయించుకుని వృధా చేశారు తప్ప సమస్య పరిష్కరించలేదని మండిపడ్డారు. ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డంపు యార్డ్ పరిశీలించి పరిష్కారిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఒక కుప్ప కూడా తీసివేయలేని దుస్థితి నెలకొన్నదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని స్వయాన డంపు యార్డ్ కు తీసుకెళ్లి చూపించినా కానీ నేటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని ఆరోపించారు.
ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప డంపింగ్ యార్డ్ సమస్య తీరడం లేదని వెంటనే డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. వినతి పత్రం కి స్పందించిన అధికారులు ఆరు నెలల్లో డంప్ యార్డును కరీంనగర్ నుండి తరలిస్తామని, విలీన గ్రామాల నుండి ట్రాక్టర్ ల ద్వారా వచ్చే చెత్తను కూడా ఆ విలీన గ్రామాల్లోనే డంపు చేస్తామనిహామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు పైడిపల్లి రాజు, పున్నం రవి, ఆసంపల్లి వినయ్ న్యాలపట్ల రాజు, రోహిత్,బీర్ల పద్మ,కొట్టే అంజలి, మామిడిపల్లి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.




