Karimnagar: నగరపాలక సంస్థలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!
Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్ ఆఫీస్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు, అధికారులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Karimnagar: నగరపాలక సంస్థలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!
నగరపాలక సంస్థలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు...
కరీంనగర్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సేవలు, అందించిన మార్గనిర్దేశాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడూతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షను ప్రజల్లో రగిలించి ఉద్యమానికి సైద్ధాంతిక భూమికను అందించడంలో జయశంకర్ సార్ పాత్ర చిరస్మరణీయమన్నారు. తన జీవితాన్ని తెలంగాణ సిద్దాంతానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన గొప్ప మహానియులని కొనియాడారు. 1969 తెలంగాణ ఉద్యమంతో పాటు అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవశ్యకత పై పలు పుస్తకాలను రచించారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అడుగడుగునా వివరించారని గుర్తుచేశారు. నేటి యువత జయశంకర్ సార్ నూ స్పూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సాగాని కొమురయ్య, సరిల్ల రాజకుమారి ప్రసాద్, అదనపు కమీషనర్ ఆయాజ్, డిప్యూటీ కమీషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, వెటర్నరీ అధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.




