Karimnagar: విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోం!
Karimnagar: వర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) పేరుతో మూడో డిస్కం ఏర్పాటును వ్యతిరేకిస్తూ కరీంనగర్ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాలు భారీ నిరసన..
Karimnagar: విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోం!
కరీంనగర్: తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) పేరుతో మూడో డిస్కం ఏర్పాటును వ్యతిరేకిస్తూ కరీంనగర్ విద్యుత్ సర్కిల్ ఆఫీస్ వద్ద భారీ నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు వెంకట్ రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పదం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని మండిపడ్డారు.
NPDCL, SPDCL సంస్థలను ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మూడో డిస్కం పేరుతో వ్యవసాయ రంగంపై అధిక భారం మోపి రైతులను ముంచే విధంగా ఈ డిస్కంల ఏర్పాటును ప్రజలు అడ్డుకోవాలని, రాబోవు రోజుల్లో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పదం చేసి ప్రజల వాడకంపై అధిక బిల్లులు వసూలు చేసే ఆలోచనలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు.
ప్రజల ఆస్తి అయిన విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పదం చేస్తే ఊరుకునేది లేదని అందర్నీ ఏకం చేసి ఉద్యమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విద్యుత్ రంగం ప్రైవేటుపరం అయితే అన్ని రంగాలు నష్టాల ఊబిలోకి వెళ్తాయని అన్ని వర్గాల ప్రజలు విద్యుత్ రంగంపై ఆధారపడి చేస్తూ జీవనాలు సాగిస్తున్నారని అలాంటి రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏ ఐ ఎస్ కె, రైతు కార్మిక సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు




