Karimnagar: ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు - విశ్వేశ్వరయ్య సేవలు స్మరణ

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు. ఎం. విశ్వేశ్వరయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పిలుపు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 15 Sept 2026 7:44 PM IST
Karimnagar
X

Karimnagar: ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు - విశ్వేశ్వరయ్య సేవలు స్మరణ

కరీంనగర్: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంజనీర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చదువు కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలను పరిష్కరించే సాధనంగా మారాలని విశ్వేశ్వరయ్య నమ్మారన్నారు. నీటిపారుదల, రోడ్లు, నిర్మాణ రంగాల్లో ఆయన అందించిన సేవలు దేశానికే ఆదర్శమని కొనియాడారు.

దేశాభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు మరువలేనివి.. లయన్స్ క్లబ్ ప్రతినిధులు

భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆదర్శాలను ప్రతి ఇంజనీర్ ఆచరించాలని ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ ఇంజనీర్ సాయిని నరేందర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వివిధ శాఖల ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. దేశాభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరూ విశ్వేశ్వరయ్య బాటలో నడిచి దేశ పురోభివృద్ధికి కృషి చేయాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, పలువురు నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN