Karimnagar: కరీంనగర్లో బాణసంచా కాలుస్తుండగా అగ్ని ప్రమాదం...

Karimnagar: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దీపావళి రాకెట్ బాంబు పడి రాజేందర్ అనే వ్యక్తికి చెందిన కారు, ద్విచక్ర వాహనం పూర్తిగా దహనం. పోలీసులు విచారణ.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 8 Nov 2026 9:48 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్లో బాణసంచా కాలుస్తుండగా అగ్ని ప్రమాదం...

కరీంనగర్: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దీపావళి బాణసంచా కాలుస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. బయటి నుంచి వచ్చి పడిన రాకెట్ బాంబు తాకిడికి రాజేందర్ కు చెందిన కారు, ద్విచక్ర వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆనందంగా వేడుకలు చేసుకుంటున్నా వారు అజాగ్రత్తగా రాకెట్బామును కాల్చడంతో అది వేగంగా వచ్చి రాజేందర్ కు చెందిన ఇంటిలో నిలిపి ఉన్న వాహనాలపై పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఇంటిలోని వారు బయటకు వచ్చి చూస్తుండగానే కారు ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదం భారీగా జరిగే అవకాశం ఉన్నందున వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాకెట్ బాంబు ఎవరు కాల్చారు, ఎక్కడి నుంచి వచ్చి పడిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

దీపావళి పండగ రోజు అజాగ్రత్తగా బాంబులు కాల్చడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది బాంబులు కాల్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించిన అవగాహన కల్పించిన ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. చిన్న అజాగ్రత్త పెద్ద ప్రమాదానికి దారితీస్తున్నాయి ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే ప్రజలలో అవగాహన పెరగాలి.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR