Karimnagar: ప్రతి ఇంటినీ సర్వే చేసి కచ్చితమైన వివరాలు సేకరించాలి
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న తొలి దశ జనగణన ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Karimnagar: ప్రతి ఇంటినీ సర్వే చేసి కచ్చితమైన వివరాలు సేకరించాలి
Karimnagar: జన గణన ప్రక్రియలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో కొనసాగుతున్న తొలి దశ జన గణన ప్రక్రియలో భాగంగా పలు డివిజన్ల పరిదిలో పర్యటించారు. నగరంలోని రాంనగర్, శ్రీహరినగర్ తదితర ప్రాంతాల్లో పలు హౌజ్ లిస్ట్ బ్లాక్ లను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. సంబంధిత బ్లాక్ ల బౌండరీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జన గణన తొలి దశలో చేపడుతున్న హౌజ్ లిస్ట్ బ్లాక్ నెంబరింగ్, మ్యాపింగ్ ప్రక్రియ పై ఎన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేస్తూ ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ జన గణన లో చేపట్టిన హౌజ్ లిస్ట్ బ్లాక్స్ మ్యాపింగ్, సిఎన్ హౌజ్ నెంబరింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జనాభా లెక్కింపులో పొరపాట్లు జరగకుండా చర్యలు తీస్కోని ప్రతి నివాస గృహాన్ని సర్వే చేసి ఖచ్చితమైన వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించాలని ఆదేశించారు. జన గణన ప్రక్రియ విధుల్లో అలసత్వం ప్రదర్శించ కుండా ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన 2027 జనాభా లెక్కింపులో ప్రజలు భాగస్వాములు కావాలని వివరాల నమోదు కొసం వచ్చిన ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు సహాకరించి సరైన వివరాలను అందించాలని కోరారు. నగర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు జన గణన సర్వే చాలా ప్రధానం అన్నారు. ఎన్యూమరేటర్లు సూపర్ వైజర్లు హౌజ్ లిస్ట్ బ్లాక్స్ వారిగా ప్రతి ఇంటిని సందర్శించి నెంబరింగ్ చేయడంతో పాటు మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. హౌజ్ లిస్ట్ బ్లాక్స్ ప్రకారం ప్రతి ఇంటి వివరాలను సేకరించి నమోదు చేయాలన్నారు.
సేకరించే వివరాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే స్వీయ గణన చేసుకున్న వారు గణన లెక్కింపు కోసం మీ నివాస గృహాలకు వచ్చిన ఎన్యూమరేటర్లకు ఐడీని చూపించి వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజలు జన గణన ప్రక్రియ వేగవంతం ముగిసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జన గణన ప్రక్రియ నగర అభివృద్ధి ఎంతో ముఖ్యమని ప్రజలు ఈ ప్రక్రియకు సహాకరించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.




