Karimnagar: బాల్య వివాహాలు రహిత గ్రామంగా రంగారావుపల్లి కీలక తీర్మానం!

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లిలో 'ప్రజల పాలన ప్రగతి నివేదిక' కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI
Published on: 26 May 2026 2:53 PM IST
Karimnagar
X

Karimnagar: బాల్య వివాహాలు రహిత గ్రామంగా రంగారావుపల్లి కీలక తీర్మానం!

కరీంనగర్: గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో 99 రోజుల ప్రజల పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దాసరి శంకరయ్య మాట్లాడుతూ బాల్య వివాహాలు సమాజానికి హానికరమని, చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు ప్రోత్సహించవద్దని, ఎవ్వరూ బాల్య వివాహాలు జరిపించకూడదని గ్రామ ప్రజలకు సూచించారు. బాలికల విద్యాభ్యాసం, ఆరోగ్యం మరియు భవిష్యత్తు దృష్ట్యా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.

సమావేశంలో గ్రామ కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ పాల్గొని బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై చర్చించారు. గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI

MADHUSUDHANREDDY, CHOPPADANDI

Next Story