Karimnagar: జీతాలు ఇవ్వాలంటూ కరీంనగర్‌లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Karimnagar: కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 17 Jun 2026 7:13 PM IST
Karimnagar
X

Karimnagar: జీతాలు ఇవ్వాలంటూ కరీంనగర్‌లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

కరీంనగర్: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా ఆసుపత్రి నందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ గత మూడు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. మూడు నెలల నుంచి కష్టాలు కన్నీళ్ళతో డ్యూటీలు చేసుకుంటా ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా అహర్నిశలు కష్టపడుతున్నాం అన్నారు.

ఈ కష్టానికి ప్రతిఫలంగా ప్రభుత్వం వెంటనే స్పందించి గత పెండింగ్ వేతనాలు మరియు మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రాబోవు రోజుల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషంట్ కేర్ మరియు ఎన్ హెచ్ ఎం ఎంప్లాయిస్, జిల్లా అధ్యక్షులు కుమారస్వామి, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీ వేల్పుల శ్రీదేవి శేషగిరిధర్ బాబు, నాగరాజు. శారద, రేణుక, స్వప్న, రాజు, భాస్కర్. సంగీత, సీరాజ్, రియాజ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story