Jammikunta: జమ్మికుంట 5వ వార్డులో ఇందిరా జీవిత బీమా, పింఛన్ల పంపిణీ!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ 5వ వార్డులో ఇందిరా జీవిత బీమా పథకం, చేనేత, చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ పంపిణీ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 21 Nov 2026 4:12 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట 5వ వార్డులో ఇందిరా జీవిత బీమా, పింఛన్ల పంపిణీ!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 5th వార్డులో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా జీవిత బీమా పథకం , చేనేత పింఛన్ల ప్రొసీడింగ్ లెటర్ల పంపిణీకార్యక్రమం వార్డు ప్రజలందరూసమక్షంలో కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి పింఛన్ పత్రాలు అందజేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మాట్లాడుతూ ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా ధైర్యము నింపడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం . కుటుంబంలోని కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబం కి ఆర్థిక భరోసా కల్పించడానికి ఉచిత ఐదు లక్షల బీమా పథకాన్ని కి అందించి ఆ కుటుంబానికి సహాయం చేయడానికి గాను ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి గాను ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.

కాబట్టి ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వార్డులో మంజూరైన చేయూత.పింఛన్లను అందజేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు రోమాల రాజ్ కుమార్. వార్డ్ ఆఫీసర్ ,RPవిజయలక్ష్మి వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA