Karimnagar: చింతకుంట పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు

Karimnagar: కరీంనగర్ చింతకుంట పాఠశాలలో జడ్జి యశ్వంత్ సింగ్ పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఇటుక బట్టీని తనిఖీ చేసి వలస కార్మికుల వివరాలు విచారించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 Oct 2026 9:57 PM IST
Karimnagar
X

Karimnagar: చింతకుంట పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు

కరీంనగర్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల నివాస పాఠశాల చింతకుంట ను సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సందర్శించి విద్యార్థులకు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.

విద్యార్థులు వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మంచి, చెడుని గుర్తించాలని, చెడుని వ్యతిరేకించాలి మరియు ధైర్యంగా చెడుపై ఫిర్యాదు చేయాలని కోరారు ఎటువంటి అసౌకర్యమైన ప్రవర్తనకి గురైన కూడా తల్లిదండ్రులకు గాని ఉపాధ్యాయులకు గాని నమ్మకమైన వ్యక్తులకు తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు రావాలని తెలియజేశారు.

ఇట్టి కార్యక్రమంలో ఎటువంటి న్యాయ సహాయాని కైనా కూడా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించవలసిందిగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి గారితో పాటు డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తనుకు మహేష్ మరియు అసిస్టెంట్ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ కొండ్ర మౌనిక పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇటుక బట్టీ తనిఖీ...

అదేవిధంగా చింతకుంట లోని ఎం ఆర్ బి ఇటుక బట్టీ ని తనిఖీ చేశారు ఇట్టి తనిఖీలు గుర్తింపు కార్డులు లేకుండా ఒరిస్సా నుండి వలస వచ్చిన కార్మికులను గుర్తించారు, అలాగే కార్మికులకు అందుతున్న జీతభత్యాల గురించి విచారించారు, గుర్తింపు పత్రాలు తీసుకోకుండా పని కల్పించిన ఇటుక బట్టిగా యజమానులపై చర్య తీసుకోవాల్సిందిగా కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR