Karimnagar: ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా ఉండాలి జడ్జి బి. రాజేశ్వర్!

Karimnagar: కరీంనగర్ జిల్లా అలుగునూర్ COEలో DLSA ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. విద్యార్థులకు రాజ్యాంగ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి రాజేశ్వర్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2026 6:55 AM IST
Karimnagar
X

Karimnagar: ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా ఉండాలి జడ్జి బి. రాజేశ్వర్!

Karimnagar: కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డిఎల్ఎస్ఎ) ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును అలుగునూర్ లోని సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులో ఈరోజు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జూనియర్ సివిల్ జడ్జ్ బి.రాజేశ్వర్ హాజరయ్యారు.

రాజ్యాంగం, చట్టాలు, వాహన చట్టాలు, కేసులు, బాలికలకు, మహిళలకు ఉపయోగపడే సెక్షన్లు, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, వాహనాలు నడిపేటపుడు హెల్మెట్ లు ధరించేలా, సీటు బెల్ట్ పెట్టుకునేలా పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.

లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. బాధిత మహిళలకుభరోసా సెంటర్ లో మానసిక, న్యాయ పరంగా సహాయం అందుతుందని,మీ సమస్యలు ఉంటే చెప్పుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఓఈ ప్రిన్సిపల్ మాధవి, డిఎల్ఎస్ఏ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story