Karimnagar: కరీంనగర్ రేకుర్తిలో ఘనంగా ప్రజాకవి కాళోజీ వర్ధంతి వేడుకలు
Karimnagar: కరీంనగర్ రేకుర్తి కాళోజీ నగర్లో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ నివాళులర్పించారు.
Karimnagar: కరీంనగర్ రేకుర్తిలో ఘనంగా ప్రజాకవి కాళోజీ వర్ధంతి వేడుకలు
కరీంనగర్: తెలుగు బాష సాహిత్యం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కాళోజీ నారాయణ రావు వర్ధంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. నగరంలోని రేకుర్తి కాళోజీ నగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాళోజీ నారాయణ రావు విగ్రహానికి మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు కార్పొరేటర్లు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాళోజీ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలపై తన కలంతో గళమెత్తిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆనాడు కాళోజీ నారాయణ రావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కొసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ, తెలుగు బాష సాహిత్యంతో ఎన్నో రకాల కవిత్వాలు, రచనలు రాసి సమాజాన్ని మేలుకొలిపారని అన్నారు. అలాంటి మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని... ఆయన స్పూర్తిని భవిష్యత్తు తరాలకు చాటి చెప్పాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు సుధగోని మాధవి కృష్ణాగౌడ్, బోయినపల్లి ప్రవీణ్ రావు, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, గాజ రమ శివరాం, స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.




