Karimnagar: పోలీసుల నిజాయితీ రూ.2 లక్షల విలువైన ఫోన్లు బాధితుడికి అప్పగింత!
Karimnagar: డ్యామ్ కట్టపై దొరికిన రూ.2 లక్షల విలువైన ఐఫోన్ 16 ప్రో, శాంసంగ్ ఫోన్లను బాధితుడికి అప్పగించిన లేక్ పోలీసులు. సిబ్బందిని అభినందించిన సీపీ గౌష్ ఆలం.
Karimnagar: పోలీసుల నిజాయితీ రూ.2 లక్షల విలువైన ఫోన్లు బాధితుడికి అప్పగింత!
కరీంనగర్: డ్యామ్ కట్టపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా దొరికిన సుమారు రెండు లక్షల రూపాయల విలువైన రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లను లేక్ పోలీసులు అత్యంత నిజాయితీతో, వేగంగా స్పందించి బాధితుడికి అప్పగించారు.
లేక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ (HC-455) శ్రీనివాస్, హోంగార్డ్ (Hg-272) శ్రీనివాస్ కలిసి డ్యామ్ కట్ట మీద నిరంతరంలాగే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కట్టపై పడిపోయి ఉన్న రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లు (iPhone 16 Pro, Samsung Z Fold 6) లభించాయి.
వీటి మార్కెట్ విలువ సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది.వెంటనే స్పందించిన సిబ్బంది సాంకేతికత మరియు స్థానిక సమాచారం సహాయంతో సదరు ఫోన్ల యజమాని వివరాలను సేకరించారు. ఆ ఫోన్లు కరీంనగర్‌కు చెందిన షేక్ సలీముద్దీన్ కుమారుడైన షేక్ సఫియుద్దీన్ (38) కి చెందినవిగా గుర్తించారు.
వెంటనే బాధితుడిని పిలిపించి, లేక్ పోలీస్ సిబ్బంది సమక్షంలో ఆ ఫోన్లను అతనికి సురక్షితంగా అప్పగించారు. పోగొట్టుకున్న అత్యంత విలువైన ఫోన్లను తిరిగి అందించినందుకు బాధితుడు షేక్ సఫియుద్దీన్ పోలీసుల నిజాయితీకి మరియు త్వరితగతిన స్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి: "డ్యామ్ మరియు పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు తమ విలువైన వస్తువులు, నగదు మరియు మొబైల్ ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొంగతనాలకు లేదా వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తలు వహించాలి. సకాలంలో స్పందించి నిజాయితీ చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డ్ శ్రీనివాస్‌లను సీపీ గౌష్ ఆలం మరియు స్థానికులు అభినందించారు.




