Karimnagar: కరీంనగర్ జిల్లాలో భూవివాదం.. అధికారులకు ఫిర్యాదు!
Karimnagar: కరీంనగర్ గోదాంగడ్డలో సర్వే నం. 1017 ప్రభుత్వ భూమి ఆక్రమణపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర సర్వే జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Karimnagar: కరీంనగర్ జిల్లాలో భూవివాదం.. అధికారులకు ఫిర్యాదు!
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ భూమి, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన అంశంపై అధికారులకు ఫిర్యాదు చేసిన గోదాంగడ్డ ప్రాంత నివాసులు.
కరీంనగర్ గోదాం గడ్డలో సర్వే నంబర్ 1017కు సంబంధించి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హాయంలో మున్సిపల్ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని హద్దులు నాటి బోర్డును ఏర్పాటు చేశారు. గతంలో కూడా పలుమార్లు ఇది చేయడానికి చూసిన ప్రతిసారి స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆగిపోయాయి అని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ అండదండలతో ఇప్పుడు భూమిని పట్టా భూమిగా మార్చి కబ్జా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
1017 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో 1018 సర్వే నెంబర్ తో ఇంటి పర్మిషన్ తీసుకొని ప్రభుత్వ భూమి అనగా 1017 లో నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు.
మున్సిపల్ అధికారులు సర్వే నంబర్ 1018కు సంబంధించిన బిల్డింగ్ పెర్మిషన్ ఆర్డర్ No. 0113/KARI/SWBP/2026, File No. 019998/KARI/00218/SWBP/2026పై అధికారులు సమగ్రంగా పరిశీలించాలి కోరారు. భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, స్థల విస్తీర్ణం, హద్దులు, రోడ్డు వెడల్పు తదితర అంశాలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా MRO స్థాయిలో స్థల పరిశీలనతో పాటు డీజీపీస్ లేదా టోటల్ స్టేషన్ సర్వే నిర్వహించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని అన్నారు. ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం కావడంతో సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు లేదా ఆక్రమణలు ఉన్నట్లయితే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.
నగరంలో ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కనిపిస్తుందని స్థానికులు అంటున్నారు. నగర నడిబొడ్డున ఉన్న భూమి కబ్జాకు గురవుతాయి మున్సిపల్ అధికారులు కానీ కార్పొరేటర్ కానీ ఎందుకు స్పందించడం లేదని వెంటనే దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని లేనియెడల నిరసనలు చేపడతామని స్థానికులు తెలిపారు.




