Jammikunta: జమ్మికుంటలో విద్యార్థులకు ఘనంగా క్విజ్ పోటీలు

Jammikunta: జమ్మికుంటలో ఎల్ఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 8 Sept 2026 10:32 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో విద్యార్థులకు ఘనంగా క్విజ్ పోటీలు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణములోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీ పరీక్షలు స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల (బాలికలు )లో LIC బ్రాంచ్ మేనేజర్ గణేష్ ఆధ్వర్యంలో, డెవోలోప్మెంట్ ఆఫీసర్ ఏల్పుల రాజేందర్ క్విజ్ మాస్టర్ గా వ్యవహరించారు.

5 రౌండ్ల లో సాగిన ఈ పోటీలలో జమ్మికుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్తులు వి.జస్వంత్,Ch.సాయి చరణ్ ప్రధమస్థానం.కాకతీయ హైస్కూల్ విద్యార్థులు వై.శ్రీకంఠసాయి,ఆర్ కౌస్తుబ్ ద్వితీయ స్థానం.విద్యోదయ విద్యార్థులు డి.అభిరూప్ లెనిన్,ఏ.రీత్విక్ లు తృతీయ స్థానం పొందారు.

విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి సతీష్ కుమార్ అభినందనలు తెలియజేయగా ఈ కార్యక్రమానికి మర్రి అవినాష్ సమన్వయకర్తగా వ్యవహరించారు. వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story