Karimnagar: కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం విశ్వ బేకరీలో ఎగిసిపడిన మంటలు
Karimnagar: కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని విశ్వ బేకరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పేలుడు శబ్దంతో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు.
Karimnagar: కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం విశ్వ బేకరీలో ఎగిసిపడిన మంటలు
Karimnagar: కరీంనగర్ లోని జగిత్యాల రోడ్డులో ఉన్న 'విశ్వ బేకరీ'లో అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టును దాటిన తర్వాత ఉన్న ఈ బేకరీలో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని చుట్టుపక్కల వారు తెలిపారు.
అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి ఆర్పి వేశారు.
ఈ అగ్ని ప్రమాదంలో బేకిరిలోని వస్తువులు, ఫర్నిచర్, నిలువ ఉంచిన సరుకులు పూర్తిగా అగ్నికి ఆపుతాయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని షాపు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




