Karimnagar: మల్లారెడ్డిపల్లిలో ఉపాధి కూలీలకు అమ్మ ఫౌండేషన్ అండ

Karimnagar: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు చల్లటి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 26 May 2026 1:06 PM IST
Karimnagar
X

Karimnagar: మల్లారెడ్డిపల్లిలో ఉపాధి కూలీలకు అమ్మ ఫౌండేషన్ అండ

Karimnagar: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామంలోని కుంటివాని చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో భాగంగా వేసవికాలం దృష్టిలో ఉంచుకొని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో కీ,శే,లు ముద్ధసాని చెన్నమల్లు 13వ వర్ధంతి మరియు కూనారం గ్రామం, కాల్వ శ్రీరాంపూర్ మండలం వాస్తవ్యుడు కర్రె కార్తీక్ జన్మదినం సందర్భంగా 300 మంది ఉపాధి హామీ కూలీలకు వారి కుటుంబ సభ్యులు ముద్దసాని శ్రీనివాస్ సల్ల ప్యాకెట్లు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామపంచాయతీ కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ చేతుల మీదుగా కూలీలకు పంపిణీ చేసి.అనంతరం మాట్లాడుతూ మా ఉపాధి హామీ కూలీలకు దాతలు స్పందిస్తూ ముందుకు వచ్చి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్నముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, 9వ వార్డు సభ్యులు గంధం ప్రశాంత్ అమ్మ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి బండారి సందీప్,సభ్యులు పూదరి అనిల్,దూలం సురేష్,మేకల స్వప్న,మేకల కొండాల్ రెడ్డి,గోనెల స్వరూప,రాయణవేణి సంపత్,మౌనిక,నిమ్మల గట్టు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story