Karimnagar: మనోవికాస పాఠశాల వ్యవస్థాపకులు బాలకిషన్ రావు కన్నుమూత

Karimnagar: కరీంనగర్ మనోవికాస పాఠశాల వ్యవస్థాపకులు బాలకిషన్ రావు బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దివ్యాంగుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 Sept 2026 5:31 PM IST
Karimnagar
X

Karimnagar: మనోవికాస పాఠశాల వ్యవస్థాపకులు బాలకిషన్ రావు కన్నుమూత

కరీంనగర్: మనోవికాస పాఠశాల వ్యవస్థాపకులు బాలకిషన్ రావు ఈరోజు ఉదయం స్వర్గస్తులైనారు. దివ్యాంగుల కోసం తానే సొంతంగా పాఠశాలను ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న మానసిక వికలాంగుల పిల్లలను చేరదీసి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి ఎంతోమందికి బాసటగా నిలిచారు బాలకిషన్ రావు.

తనకు మానసిక వికలాంగుడైన కుమారుడి జన్మించడంతో అతన్ని పట్టుకొని హైదరాబాదులో పలు కేంద్రాలు ఆసుపత్రులు సందర్శించి విసిగి వేసారిన బాలకిషన్ ఇలాంటి పిల్లల కోసం ఏదైనా చేయాలని ఆలోచనతో కరీంనగర్లో పాఠశాలను నెలకొల్పారు. హైదరాబాదులోని స్వీకర్ ఉపకార్ మాదిరిగా కరీంనగర్లో మానసిక వికాస్ అనే పాఠశాలను 1988లో ఏర్పాటు చేశారు.

మానసిక పాఠశాలను ఏర్పాటు చేసినప్పుడు 12 మంది విద్యార్థులతో నెలకొల్పి నేడు సుమారు 100 మంది దివ్యాంగులతో దివ్యాంగులతో పాఠశాలను నడిపిస్తున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు దివ్యాంగ పిల్లలతో ఎలాంటి సమస్యలు ఉంటాయో వాటిని తొలగించడానికి దివ్యాంగులలో మానసిక పరిపక్వత కోసం డాక్టర్లు, యోగ టీచర్లు, ఏర్పాటు చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.

ఈ పాఠశాలను 10 సంవత్సరముల వరకు తన సొంత ఖర్చులు భరిస్తూ పాఠశాలను నడిపించిన బాలకిషన్ రావు ప్రభుత్వ అనుమతితో ఎల్ఎండి డ్యాం వద్ద గల ఐటిఐ కళాశాల వెనుక సైడు 20 గుంటల భూమిలో అత్యాధునిక అంగులతో భవనాన్ని నిర్మించి విద్యార్థుల కోసం అహర్నిశలు కృషి చేసినారు. మానసిక వికలాంగుల విద్యార్థుల కోసం తన సొంత ఖర్చులతో ఒక బస్సును కొనుగోలు చేసి దివ్యాంగుల పిల్లలను అక్కడినుండే పికప్ చేసుకొని స్కూల్ వద్ద చేర్చి స్కూల్ అయిపోగానే వారి ఇంటి వద్ద దింపే విధంగా ఏర్పాటు చేశారు.

మరొక వాహనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వెచ్చించి దానిని కూడా విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నారు. తన కొడుకు లాగా ఇబ్బంది పడుతున్న మరి ఎంతోమంది దివ్యాంగుల తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకున్న బాలకిషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో గర్వకారణమని తనతో అనుబంధం ఉన్న స్నేహితులు కుటుంబ సభ్యులు పాఠశాల సిబ్బంది తెలిపారు. తాను మరణించినా కూడా తన కళ నెరవేరుతుందని లక్ష్యంతో పాఠశాల నెలకొల్పి అది ఎప్పటికీ నిలిచి ఉండే విధంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమైనమని పలువురు కొనియాడారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR