Karimnagar: కరీంనగర్‌లో వైభవంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ బర్త్‌డే వేడుకలు

Karimnagar: కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బండి సంజయ్ ఆశీస్సులు తీసుకోగా, నగరవ్యాప్తంగా అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 26 Aug 2026 7:04 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో వైభవంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ బర్త్‌డే వేడుకలు

కరీంనగర్: కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నగరవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో మేయర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ భారీ కేక్‌ను కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి.

అనంతరం శివభక్త హనుమాన్ దేవాలయం, కోదండ రామాలయం, మహాశక్తి దేవాలయం లో మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని దేవుడిని, అమ్మవారిని ప్రార్థించారు. మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మేయర్ జన్మదినోత్సవం సందర్భంగా తీగలగుట్టపల్లి లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, వెంకటాద్రి హాస్పిటల్ వారిచే నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణ చౌక్‌లో 39 కిలోల భారీ కేక్...

నగర పాలక సంస్థ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద నిర్వహించిన జన్మదిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 39 కిలోల భారీ కేక్‌ను మేయర్ కొలగాని శ్రీనివాస్ కట్ చేశారు. పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు...

మేయర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బస్టాండ్ చౌరస్తా వద్ద దేవరకొండ అజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మేయర్ పాల్గొని ప్రజలకు స్వయంగా అన్నప్రసాదం అందించారు.

అలాగే కార్పొరేటర్లు ఏపీపీ చంద్ర, తోట అనిల్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు.

నగరపాలక సంస్థ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో మేయర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చింతకుంట శాంతినగర్‌లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు మేయర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల ప్రేమాభిమానాలు మరింత బాధ్యతను పెంచాయి

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, తన జన్మదినం సందర్భంగా నగరవ్యాప్తంగా నిర్వహించిన వేడుకలు, సేవా కార్యక్రమాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని తెలిపారు.

“నాపై ప్రేమాభిమానాలు చూపుతూ ఆశీర్వదించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి, నగర ప్రజలకు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలు చూపుతున్న ఆదరణ నాకు మరింత బాధ్యతను పెంచుతోంది. వారి ఆశీస్సులతో కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తాను” అని మేయర్ పేర్కొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story