Karimnagar: కరీంనగర్ డివిజన్ల అభివృద్ధిపై మేయర్ ఫోకస్.. 21వ డివిజన్‌లో కొత్త రోడ్లు!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ 21వ డివిజన్‌లో రూ. 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు మరియు మంచినీటి పైపులైన్ పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు.
Karimnagar: కరీంనగర్ డివిజన్ల అభివృద్ధిపై మేయర్ ఫోకస్.. 21వ డివిజన్‌లో కొత్త రోడ్లు!
కరీంనగర్: నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మా పాలకవర్గం ప్రధాన లక్ష్యం అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా 21 వ డివిజన్ లో పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ వరాల నర్సింగంతో కలిసి నగరపాలక సంస్థ కు చెందిన 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు, మంచి నీటి పైపులైన్ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేశారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నగర ప్రజల యొక్క ప్రాథమిక సమస్యలను ప్రాధాన్యత తో పరిష్కరించమే మా పాలకవర్గం ద్యేయం అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహాకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డివిజన్లలో కొన్ని కాలనీల్లో మంచి నీటి పైపులైన్లు సరిగా లేక త్రాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్న దృష్ట్యా స్థానిక ప్రజలు, పాలకవర్గ సభ్యులు మా దృష్టికి తేవడంతో పైపులైన్ పనులతో పాటు సీసీ రోడ్డు పనులు ప్రారంభం చేశామని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టరును ఆదేశించారు. ముఖ్యంగా విలీన గ్రామాల డివిజన్లు శివారు ప్రాంతాల డివిజన్ల పై ప్రత్యేక దృష్టి సారించామని వాటిని నగరంతో సమానంగా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు మౌలిక వసతులు కల్పించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వేసవి కాలం త్రాగు నీటి ఇబ్బందులు రాకుండా నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీస్కుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, డివిజన్ ముఖ్య నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




