Karimnagar: కరీంనగర్‌లో ఓపెన్ జిమ్ ప్రారంభం: 'ఫిట్ ఇండియా' స్ఫూర్తితో ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం.. మేయర్ కొలగాని శ్రీనివాస్!

Karimnagar: కరీంనగర్ 6వ డివిజన్ బొమ్మకల్‌లో మలయప్ప ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన నూతన ఓపెన్ జిమ్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 Jun 2026 5:25 PM IST
Karimnagar: కరీంనగర్‌లో ఓపెన్ జిమ్ ప్రారంభం: ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం.. మేయర్ కొలగాని శ్రీనివాస్!
X

కరీంనగర్: కరీంనగర్ నగరంలోని 6వ డివిజన్‌ బొమ్మకల్ లో మలయప్ప ఫౌండేషన్ సీఎస్ఆర్ (CSR) నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “ఫిట్ ఇండియా” నినాదం స్ఫూర్తితో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఈ ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో, మలయప్ప ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ ఓపెన్ జిమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని, యువతతో పాటు అన్ని వయస్సుల వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ , మున్సిపల్ సిబ్బంది, వాకర్స్, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story