Karimnagar: కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన!

Karimnagar: కరీంనగర్ 27, 30 డివిజన్లలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Sept 2026 5:47 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన!

Karimnagar: నగర పాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్‌లో సుడా నిధులతో సీసీ రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేశారు. అనంతరం 30వ డివిజన్ లో పది లక్షల మునిసిపల్ సాధారణ నిధులతో SWG పైపులైన్ పనులకి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నగర పాలక సంస్థ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని, డివిజన్ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 27వ కార్పొరేటర్ బోట్ల శ్యామల కిరణ్ , 30వ డివిజన్ కార్పొరేటర్ కళ్లేపల్లి శారద , మున్సిపల్ అధికారులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story