Karimnagar: స్మశానంలో నివసిస్తున్న కుటుంబానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ సహాయం
Karimnagar: కరీంనగర్‌లో స్మశానవాటికలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ కుటుంబాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ పరామర్శించి సహాయం అందించారు.
Karimnagar
Karimnagar: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ గాండ్ల శ్రీకాంత్ కుటుంబానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆర్థిక, మానసిక బరోసా కల్పించారు. నివాసం లేక స్మశానవాటికలో తలదాచుకుంటున్న ఆ కుటుంబ పరిస్థితిపై మేయర్ స్పందించారు.
గాంధీనగర్‌లో అద్దెకు ఉంటూ జీవనం సాగించిన శ్రీకాంత్ మరణానంతరం, అద్దె యజమాని ఇంట్లోకి అనుమతించకపోవడంతో కుటుంబం పద్మానగర్ స్మశానవాటికలో నివాసం ఉంటున్న విషయం తెలిసి మేయర్ వెంటనే స్పందించారు. అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. కుటుంబంలోని ఆడపిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.




