Karimnagar: విజయదుర్గ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన!

Karimnagar: కరీంనగర్ విజయదుర్గ కాలనీలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్, సునీల్ రావు. పాల్గొన్న కార్పొరేటర్ వరాల నర్సింగం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 16 Aug 2026 5:18 PM IST
Karimnagar
X

Karimnagar: విజయదుర్గ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన!

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా 21వ డివిజన్ విద్యానగర్‌ పరిధిలోని విజయదుర్గ కాలనీ రోడ్డు నెంబర్-1 లో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై, కొబ్బరికాయ కొట్టి నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కాలనీ పెద్దలు బి. రత్నాకర్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story