Karimnagar: నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 4, 40 వ డివిజన్లలో రూ. 13.40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు పైప్లైన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
Karimnagar: నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్
కరీంనగర్: నగరపాలక సంస్థ అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా సోమవారం 4, 40 వ డివిజన్ పర్యటించారు. 4 వ దుర్షేడ్ బేడబుడగ జంగాల కాలనీలో స్థానిక కార్పోరేటర్ భూపతి రవీంధర్ తో కలిసి రూ. 10 లక్షల మున్సిపల్ సాధరణ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు.
అనంతరం 40 వ డివిజన్ కట్టరాంపూర్ లో స్థానిక కార్పోరేటర్ నలువాల పుష్పలత రవీంధర్ తో కలిసి 3.40 లక్షల నిధులతో మంచి నీటి పైపులైన్ పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... నగరపాలక సంస్థ లో విలీనం చెందిన శివారు ప్రాంతల డివిజన్ల అభివృద్దే ద్యేయంగా తమ పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. సంబంధిత ప్రాంతాల్లో చాలా సమస్యలు తిష్ట వేసాయని... సంబంధిత రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు, త్రాగునీరు, పారిశుధ్యం తదితర సమస్యలన్నీటిని ప్రాధాన్యత క్రమంలో దశలవారిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
నగరపాలక సంస్థ సాధారణ నిధులు, యూఐడిఎఫ్ నిధులతో ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభం చేశామన్నారు. యూఐడిఎఫ్ నుండి ప్రస్తుతం 50. కోట్లతో నగరంలో తో పాటు ఇతర శివారు ప్రాంత డివిజన్లను కూడ అభివృద్ధి బాట పట్టిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు నిత్యం ప్రజల మద్యనే ఉంటూ... పాలకవర్గ సభ్యుల ద్వారా నేరుగా డివిజన్ల లో సమస్యలను తెలుసుకొని ప్రజలకు కావల్సిన వసతులు సౌకర్యాలను కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్ల తెలిపారు. మా పాలకవర్గం నగర అభివృద్ధే ద్యేయంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.
నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




