Karimnagar: కరీంనగర్‌లో పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్.. మేయర్ శ్రీనివాస్
Karimnagar: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో నగర పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
Karimnagar: కరీంనగర్‌లో పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్.. మేయర్ శ్రీనివాస్
కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో నగర పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ 29, 13, 38, 39 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో మురికి కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు పనులను మేయర్ స్వయంగా పరిశీలించి, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాలువల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
మేయర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం నగర పాలక సంస్థ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు సోమిడి వేణు, తెల్ల లక్ష్మి రమేష్, మాసం గణేష్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ వర్కర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




