Karimnagar: కరీంనగర్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మేయర్

Karimnagar: కరీంనగర్ సీతారాంపూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్. అమృత్ 2.0 నిధులతో ప్లాంటేషన్ పనులు ప్రారంభం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 13 Aug 2026 6:54 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మేయర్

కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 23వ డివిజన్ సీతారాంపూర్ ప్రాంతంలో సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్‌లో అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు నగరపాలక సంస్థ ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుధ్య సదుపాయాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. సీతారాంపూర్ ప్రాంతంలో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులు పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగి, మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

అనంతరం 17, 18 డివిజన్లకు సంబంధించిన అమృత్ 2.0 నిధులతో చేపట్టనున్న బ్లాక్ ప్లాంటేషన్ ఫెన్సింగ్ పనులను మేయర్ గారు ప్రారంభించారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేపట్టుతున్న ఈ పనులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని ఆయన అన్నారు. మొక్కల సంరక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా వాటి పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి రాజకుమార్ గారు, 17, 18వ డివిజన్ కార్పొరేటర్లు శ్రీమతి వేముల కవిత చంద్రశేఖర్ గారు, శ్రీ వాసాల రమేష్ గారు, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story