Karimnagar: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనులను వేగవంతం చేయాలి
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనులపై కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమీక్ష. డీపీఆర్లు సిద్ధం చేసి టెండర్లు ప్రారంభించాలని ఆదేశం.
Karimnagar: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనులను వేగవంతం చేయాలి
కరీంనగర్: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కరీంనగర్ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ కన్సల్టెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. యూసీఎఫ్ పథకం పరిధిలో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలు, సాంకేతిక అనుమతులు, టెండర్ల ప్రక్రియల తదితర అంశాల పై లోతుగా చర్చించారు. కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఏజెన్సీ ప్రతి నిధులకు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ చాలేంజ్ ఫండ్ పథకం లో రూపొందించిన ప్రాజెక్టుల ప్రతిపాదనల ప్రక్రియను వేగవంతం చేసి... అభివృద్ధి పనులు చేపట్టేలా తగిన చరలు చేపట్టాలన్నారు. నగరంలో రోడ్లు, వరద మురుగు నీటి కాలువల నిర్మాణ అభివృద్ధికి సంబంధించిన రెండు కీలక డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టుల ప్రాసెస్ వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.
వీటిని వెంటనే సాంకేతిక అనుమతులు టెండర్ ప్రక్రియ నిమిత్తం ఈఎన్సీ కార్యాలయానికి పంపించి ప్రాజెక్టుల పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీస్కోవాలనన సూచించారు. నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు) సంబంధించి కన్సల్టెన్సీ రూపొందించిన డీపీఆర్ తుది మెరుగులపై కూలంకషంగా సమీక్షించమని తెలిపారు.
తుది నివేదికను జాప్యం చేయకుండా త్వరితగతిన సమర్పించాలని కన్సల్టెన్సీ ప్రతి నిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించే దిశగా త్వరలోనే పనులు ప్రారంభం చేసేలా చర్యలు చేపట్టాలని ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో నగరపాలక సంస్థ డీఈ దేవేంధర్, సంబంధిత ప్రాజెక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులు పాల్గొన్నారు.




