Karimnagar: కరీంనగర్ మెడికల్ కాలేజీ విద్యార్థుల నిరవధిక ఆందోళన

Karimnagar: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టళ్ల అప్పగింత జాప్యం, రవాణా సమస్యలపై విద్యార్థుల నిరవధిక ఆందోళన; గేటు ఎదుట భోజనం చేసి వినూత్న నిరసన.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 22 Nov 2026 10:47 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ మెడికల్ కాలేజీ విద్యార్థుల నిరవధిక ఆందోళన

కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో భవన నిర్మాణం, హాస్టళ్ల అప్పగింతలో జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. గత రెండు రోజులుగా నిరవధికంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కోరారు. గతంలో బాలుర హాస్టల్లో నవంబర్ 20వ తేదీలోగా అప్పగిస్తామని చెప్పిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం అప్పగించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాలికల హాస్టలు, బాలుర హాస్టల్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆలస్యం కావడంతో చాలా క్లాసులు మిస్ అవుతున్నామన్నారు. నూతన మెడికల్ కాలేజీకి వెంటనే హాస్టల్ భవనాన్ని అప్పగించాలని వారు ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇంకా చేర్చుకోలేదని అన్ని ప్రాంతాల్లో ఆఫ్లైన్లో క్లాసులు జరుగుతా ఉంటే కరీంనగర్లో మాత్రం ఆన్లైన్లో క్లాసులు జరపడం సౌకర్యాల లేమికి నిదర్శనం అన్నారు.

మెడికల్ కళాశాల విద్యార్థులు ఈరోజు నిన్న రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఎవరు పట్టించుకోవడంలేదని ఈరోజు గేటుకు ఎదురుగా భోజనం చేసి పాటలు పాడి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల హాస్టల్ భవనాలను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఓ పక్క చదువుకు దూరమవుతున్నాము మరోపక్క సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ నుండి రావడానికి రెండు బస్సులు సరిపోవడం లేదని, సౌకర్యాలా లేమి స్పష్టంగా కనిపిస్తుందని అయినా ఎవరు స్పందించడం లేదని అందుకోసమే మా బాధలు తెలపడం కోసం ఈరోజు రోడ్డుపై వచ్చి నిరసన ద్వారా తమ సమస్యలు విన్నవిస్తున్నామన్నారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని వారు కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR