Karimnagar: డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారా? కరీంనగర్‌లో భారీ రిక్రూట్‌మెంట్ షురూ!
Karimnagar: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో మే 5న మెగా జాబ్ మేళా.
Karimnagar: డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారా? కరీంనగర్‌లో భారీ రిక్రూట్‌మెంట్ షురూ!
కరీంనగర్: జిల్లాలో నిరుద్యోగ యువ తకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మే 5న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 5న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో గల ఆడిటోరియం లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. డీఈఈట్, టాస్క్ , ఉపాధి కల్పన కార్యాలయ సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు.
జిల్లాలోని లోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు విద్యా సంస్థలతో సమన్వయం చేసుకుని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. జాబ్ మేళా సమాచారం ప్రతి ఒక్కరికీ చేరేలా వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాను వినియోగించాలని సూచించారు. కాలేజీల పూర్వ విద్యా ర్థుల వివరాలను సేకరించి, నిరుద్యోగంగా ఉన్న వారికి సమాచారం చేరేలా చూడాలని, టాస్క్ లో నమోదు చేసు కున్న యువతకు కూడా సమాచారం పంపించాలని తెలి పారు. ఈ మెగా జాబ్ మేళాను జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి సమన్వయం చేస్తున్నారని తెలిపారు.
మే 5న నిర్వహించనున్న ఈ జాబ్ మేళాను కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని నిరు ద్యోగ గ్రాడ్యుయేట్లు అందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి,Deet అధికారి, ఇండస్ట్రియల్ అధికారి పాల్గొన్నారు.




