Karimnagar: కరీంనగర్ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. మే 5న మిస్ అవ్వకండి!

Karimnagar: కరీంనగర్ జిల్లా నిరుద్యోగులకు కలెక్టర్ చిత్రా మిశ్రా శుభవార్త చెప్పారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 2 May 2026 10:09 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. మే 5న మిస్ అవ్వకండి!

కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మే 5వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ తన కార్యాలయంలో టాస్క్, ఎంప్లాయిమెంట్, ఇండస్ట్రియల్, స్పోర్ట్స్ శాఖల అధికారుల సమక్షంలో జాబ్ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తు న్నామని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు తమ ప్రతిభను ప్రదర్శించి మంచి ఉద్యోగాలను పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డి వై ఎస్ ఓ శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధి కల్పనా అధికారి తిరుపతిరావు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story