Karimnagar: కరీంనగర్‌లో మతసామరస్య చాటిన ఎంఐఎం నేత సేవలు!

Karimnagar: కరీంనగర్: జమ్ జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన భక్తులకు బాదం మిల్క్, లస్సీ, మినరల్ వాటర్ పంపిణీ చేసిన కలెక్టర్, సీపీ.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 24 Sept 2026 10:00 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో మతసామరస్య చాటిన ఎంఐఎం నేత సేవలు!

Karimnagar: గణేష్ నిమజ్జనం రోజు మినరల్ వాటర్, లస్సీ, బాదం మిల్క్, కూల్ డ్రింక్స్, రోజ్ వాటర్ ను స్వంత ఖర్చులతో హిందూ సోదరులకు అందిస్తున్న ఎంఐఎం నేత గులాం అహ్మద్ హుస్సేన్...

2005 నుంచి నేటి వరకు మానవత్వమే అభిమతంగా జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ పేరిట దేశంలోనే ఆదర్శంగా సేవలు.. స్టాల్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీసు కమిషనర్ గౌష్ ఆలం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..

మానవత్వమే అభిమతంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా..మతసామరస్యానికి ప్రతీకగా, గంగా జమున తెహజీబ్ కు కేరాఫ్ కరీంనగర్ నగర వేదికగా, హిందూ-ముస్లిం భాయి భాయి అనే నినాదంతో జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు..

సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు, మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా పోలీసు కమిషనర్ గౌష్ ఆలం, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లు అన్నారు..

బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా, నగరంలోని రాజీవ్ చౌక్ లో బాదం మిల్క్, మినిరల్ వాటర్, లస్సీ, రూ అబ్జా, గులాబ్ వాటర్ స్టాల్ ను సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత పెద్ద స్టాల్ ను రాజీవ్ చౌక్ లో ఏర్పాటు చేసి సుమారు 30వేల మంది హిందూ సోదరుల కోసం ఉచిత మినరల్ వాటర్ బాటిల్స్, గులాబ్ వాటర్, లస్సీ.. బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ ను పంపిణీ చేస్తూ..దేశంలోనే గులాం అహ్మద్ ఆదర్శంగా నిలుస్తున్నడాని పేర్కొన్నారు.

దేశంలోనే భిన్నంగా..మత సామరస్యానికి ప్రతీకగా, గంగా జమున తెహజీబ్ కు కేరాఫ్ గా కరీంనగర్లో హిందూ-ముస్లిం అనే భేదభావం లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించే పద్ధతిలో భాగంగా గణేష్ నిమజ్ఞానికి వెళ్లే నగర హిందూ సోదరీ, సోదరుల కోసం ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా త్రాగునీరు, శీతల పానీయాలు పంపిణీ చేయడం ఎంతో మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. నిమజ్జనానికి వెళుతున్న అశేష జనానికి సరిపడా ఈసౌకర్యాన్ని జమ్ జమ్ వెలేర్ సొసైటీ ద్వారా స్టాల్ ఏర్పాటు చేసి సేవలందించడం మతసామరస్యానికి మారుపేరుగా నిలిచిందని కొనియాడారు.

ప్రారంభోత్సవానికి వచ్చిన కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌస్ ఆలం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లకు, గులాం అహ్మద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఏసీపీలు వెంకటస్వామి, విజయ్ కుమార్, వాసాల సతీష్, ఎస్బిఐ అనీల్ కుమార్, సిఐలు రాంచంద్రరావు, తిరుమల్, సృజన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎస్బి ఎస్సై శ్రీనివాస్, ఎంఐఎం కార్పొరేటర్లు సయ్యద్ ఇబ్రహీం,మాజిద్ హుస్సేన్,

మాజీ కార్పొరేటర్ లు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, ఆరిఫ్ అహ్మద్, లింగపల్లి శ్రీను, నాయకులు అబ్దుల్ గఫ్ఫార్, వాజిద్ అలీఖాన్, ఖాజా మజారోద్దీన్, గాలి రాజు, అబ్దుల్లా ఖాన్, అక్బర్ అలీ, అన్నేమల్ల సురేశ్, మేరాజ్, తాజుద్దీన్, ఖమరొద్దీన్ షబ్బీర్, సలీం, సాజిద్, ఇలియాజ్, బాబా ఖాలీద్, రెహన్, యాసర్, సుల్తాన్ మీర్జా, షెహరాజ్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN