Gangadhara: గంగాధరలో మినీ జీపీఎల్ క్రికెట్ హంగామా.. 10 రోజుల పాటు పండుగే!
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధరలో మినీ జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.
Gangadhara: గంగాధరలో మినీ జీపీఎల్ క్రికెట్ హంగామా.. 10 రోజుల పాటు పండుగే!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండల కేంద్రంలో గంగాధర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ కొంతం దిలీప్ కుమార్, మధురానగర్ వార్డ్ సభ్యుడు గొంటి సంజీవ్, బిఆర్ఎస్ యువ నాయకుడు ఠాగూర్ టోర్నమెంట్‌ను ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
గంగాధర మండలంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ జీపీఎల్ టోర్నమెంట్‌లో మొత్తం 7 జట్లు పాల్గొంటున్నాయి. రానున్న 10 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో గంగాధర మండలానికి చెందిన దాదాపు 250 మంది ప్లేయర్లు తమ ప్రతిభను కనబరచనున్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు యువతను క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఫ్రాంచైజీ ఓనర్లు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.




