Karimnagar: కరీంనగర్ మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు జయంతి

Karimnagar: కరీంనగర్‌లో జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకలు. హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు. రాజకీయాల్లో ఆయన ఆదర్శప్రాయులని కొనియాడారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 19 July 2026 3:27 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు జయంతి

కరీంనగర్: దివంగత మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు జయంతి సందర్భంగా నగరంలోని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చొక్కారావు జయంతి వేడుకలకు హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్, ఐటి మరియు పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు ,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దివంగత నేత మా రాజకీయ గురువు చొక్కారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.వారు రాజకీయాల్లో పారదర్శకత నీతికి నిజాయితీకి మారు పేరు వారిని ఆదర్శకంగా తీసుకొని జిల్లా రాజకీయాల్లో ఎదిగాం అన్నారు. వారి ఆశయాలు వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతాం.వారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నా అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పుల అంజని ప్రసాద్, ఏం.డి తాజ్,ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, మడుపు మోహన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పడిశెట్టి భూమయ్య, బోనాల శ్రీనివాస్, నిహాల్ అహ్మద్, వంగల విద్యాసాగర్, కామ్రెడ్డి రాంరెడ్డి, కిమ్ పహాద్ , మాదాసు శ్రీనివాస్, కంకణాల అనిల్ కుమార్, కుంభాల రాజు కుమార్,తోట అంజయ్య, కొట్టే ప్రభాకర్, పెద్ది గారి తిరుపతి, సాయిని తిరుపతి, షబాన మహమ్మద్, ఖలీల్, నాగుల సతీష్, ముక్క భాస్కర్, స్వప్న శ్రీ, బసవరాజ్ శంకర్, పెంట శేఖర్, రాచర్ల పద్మ, కుర్ర పోచయ్య, నెల్లి నరేష్, గుండారపు శ్రీనివాస్, వీర దేవేందర్, మార్కరాజు, బత్తిని చంద్రయ్య గౌడ్, సుంకరి గణపతి, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story