Karimnagar: కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు షాక్: బీఆర్ఎస్‌లోకి మైనారిటీ యువకులు

Karimnagar: కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మైనారిటీ యువకులు కాంగ్రెస్‌ను వీడి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Oct 2026 3:54 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు షాక్: బీఆర్ఎస్‌లోకి మైనారిటీ యువకులు

కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పలువురు మైనారిటీ యువకులు హస్తం పార్టీని వీడారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో వారు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మరిచిపోకనే మళ్లీ BRS పార్టీలోకిపెద్ద ఎత్తున యువకులు చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలైనా కరీంనగర్లో తట్టెడు మట్టి ఎత్తిపోయా లేదన్నారు.. కరీంనగర్ పట్టణంలో BRS ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్