Karimnagar: కోర్టు వద్ద అంబేద్కర్ విగ్రహానికి గంగుల నివాళులు
Karimnagar: కరీంనగర్ కోర్టు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్; విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కట్టవద్దని కొరివి వేణుగోపాల్ విజ్ఞప్తి.
Karimnagar: కోర్టు వద్ద అంబేద్కర్ విగ్రహానికి గంగుల నివాళులు
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని కోర్టు వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నవంబర్ 4వ ఆదివారం రోజున కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం, ప్రతి ఆదివారం అంబేద్కర్ ను తలుచుకోవడం చాలా స్ఫూర్తిదాయకం అన్నారు.
ఈ కార్యక్రమాన్ని నవంబర్ మొదటి ఆదివారం నుండి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నాలుగువ ఆదివారం రోజున ఎమ్మెల్యే గంగుల హాజరై పూలమాలవేశారని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984లో అప్పటి కేంద్రమంత్రి శివశంకర్ ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారని తెలిపారు. కరీంనగర్ జిల్లా ప్రజలు అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉందన్నారు. అటువంటి ప్రాధాన్యత గల విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కట్టడం మానుకోవాలన్నారు. ప్రధానమంత్రి పార్టీ వాళ్లను, ముఖ్యమంత్రి పార్టీ వాళ్ళను, మాజీ ముఖ్యమంత్రి పార్టీ వాళ్ళ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహ ప్రతిష్టను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో చల్ల హరి శంకర్, నాయకులు గజ్జల ఆనందరావు, సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్, ఎడ్ల రాంకుమార్, గాదం రవీందర్, పాటాకుల భూమయ్య, మాడెపు నరసయ్య, దశనం శ్యామ్, చిలువేరి రవీందర్, మండిగ మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.




