Karimnagar: ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కలిసిన జలాలుద్దీన్ అక్బర్!
Karimnagar: కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జలాలుద్దీన్ అక్బర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Karimnagar: ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కలిసిన జలాలుద్దీన్ అక్బర్!
కరీంనగర్: బదిలీపై కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జలాలుద్దీన్ అక్బర్ నేడు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జలాలుద్దీన్ అక్బర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్,మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, గందె మహేష్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు జమీలుద్దీన్, నగర మైనారిటీ అధ్యక్షుడు మీర్ సౌకత్ అలీ, నాయకులు కర్ర సూర్యశేఖర్, నవాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.




