Karimnagar: ఆకుల ప్రభాకర్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే గంగుల!

Karimnagar: కరీంనగర్‌లో పదవీ విరమణ పొందిన చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ ఆకుల ప్రభాకర్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Nov 2026 8:06 PM IST
Karimnagar
X

Karimnagar: ఆకుల ప్రభాకర్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే గంగుల!

కరీంనగర్: వైద్య విధాన పరిషత్ విభాగంలో చీఫ్ ఫార్మసీ ఆఫీసర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన ఆకుల ప్రభాకర్ సేవలు అభినందనీయమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నగరంలోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న ఓ వేడుకల మందిరంలో నేడు ఆకుల ప్రభాకర్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభాకర్‌ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదవీ విరమణ అనేది ఉద్యోగ బాధ్యతల నుంచి విశ్రాంతి పొందే సందర్భమేమని. ఉద్యోగ జీవితం అనంతరం కుటుంబంతో ఆనందంగా గడుపుతూ, సమాజసేవకు శేష జీవితాన్ని వినియోగించాలని సూచించారు. ఆకుల ప్రభాకర్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

కరోనా విపత్కర సమయంలో ఆకుల ప్రభాకర్ అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం ఆకుల ప్రభాకర్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN