Karimnagar: గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Karimnagar: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి–పొత్తూరు మార్గంలో తిరిగి ప్రారంభమైన డబుల్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి.

ANJANEYULU, MANAKONDURU
Published on: 12 Nov 2026 10:17 PM IST
Karimnagar
X

Karimnagar: గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కరీంనగర్: గన్నేరువరం గుండ్లపల్లి–పొత్తూరు మార్గంలో నిలిచిపోయిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కావడంతో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు.

గనుకుల కొండాపూర్ సమీపంలో రోడ్డు నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ తిరిగి పనులు ప్రారంభించడం సంతోషకరమన్నారు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ ఉత్సాహంగా పనులను పునఃప్రారంభించారని తెలిపారు.

ప్రస్తుతం డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు త్వరితగతిన రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చేలా పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU