Karimnagar: కరీంనగర్ బల్దియాలో అభివృద్ధి పనుల తనిఖీ!
Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్ ఆవరణలో అభివృద్ధి పనుల తనిఖీ వెల్ నెస్ సెంటర్, లైబ్రరీ నిర్మాణాలను వేగవంతం చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశం.
Karimnagar: కరీంనగర్ బల్దియాలో అభివృద్ధి పనుల తనిఖీ!
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ ఆవరణలో గల నూతన భవన రెండో అంతస్తు, వెల్ నెస్ సెంటర్, లైబ్రరీ, సానిటేషన్ స్టోర్ షెడ్ల నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా కార్యాలయ ఆవరణలో నూతనంగా భవనం పై అంతస్తు అభివృద్ధి పనులతో పాటు వెల్ నెస్ సెంటర్, లైబ్రరీ, సానిటేషన్ స్టోర్ షెడ్ల నిర్మాణ పనులను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. ప్రస్తుత పనుల పురోగతి వివరాలను ఇంజనీరింగ్ అధికారి, సంబంధిత కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నందున ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... ఉద్యోగ సిబ్బందికి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. చేపడుతున్న అభివృద్ధి పనులో నాణ్యతా ప్రమాణాలు పాటించి...లైబ్రరీ, వెల్ నెస్ సెంటర్లను త్వరితగతిన అందుబాటులోకి తీస్కరావాలన్నారు. త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారి ఏఈ సతీష్, సంబంధిత కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.




