Karimnagar: గుడ్ గవర్నెన్స్ కార్యక్రమానికి కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ ఎంపిక
Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఐఏఎస్, ముస్సోరీలోని లాల్ బహదూర్ అకాడమీలో జరిగే 'గుడ్ గవర్నెన్స్' శిక్షణకు ఎంపికయ్యారు.
Karimnagar: గుడ్ గవర్నెన్స్ కార్యక్రమానికి కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ ఎంపిక
కరీంనగర్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీలో గల 'లాల్ బహదూర్ జాతీయ పరిపాలన అకాడమీ' వేదికగా ప్రతిష్టాత్మక నిర్వహించే ప్రత్యేక ఉన్నత స్థాయి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఐఏఎస్ ఎంపికయ్యారు. సోమవారం జూన్ 8 నుండి 13 వరకు వారం రోజుల పాటు జరిగే "గుడ్ గవర్నెన్స్ ఫర్ ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్" (" క్షేత్ర స్థాయి నిర్వాహాకుల సుపరిపాలన") కార్యక్రమంలో పాల్గొననున్నారు.
భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న" క్షేత్రస్థాయి పరిపాలన " ఉన్నత స్థాయి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం నుండి సమర్థవంతమైన ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఎంపిక చేసింది. ఇందులో కరీంనగర్ నగరపాలక సంస్థ ఐఏఎస్ అధికారులైన కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ మంద మకరందు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి. రాహుల్ కు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందించడం జరిగింది.
"గుడ్ గవర్నెన్స్ ఫర్ ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్" కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయి పరిపాలనలో ఉత్తమ విధానాలు, పారదర్శకత, ప్రజలకు మరింత మెరుగైన పాలన, వేగవంతమైన సేవలు అందించడం, మున్సిపల్ వ్యవహారాల్లో సరికొత్త సంస్కరణలు తీసుకురావడం పై కార్యక్రమంలో వారం రోజుల పాటు వివరించడం జరుగుతుంది.
ఈ సంధర్బంగా కరీంనగర్ నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం "గుడ్ గవర్నెన్స్" కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంపిక చేయడం హర్షనీయం అన్నారు. ఉన్నత స్థాయి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంబంధిత కార్యక్రమ ఎజెండా అంశాల ఆధారంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజలకు క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన పాలన, సరికొత్త అభివృద్ధి సంస్కరణలు ఎంతగానో దోహదపడుతాయని వెల్లడించారు.




